మద్యం సేవిస్తూ కిందపడి వ్యక్తి మృతి

మద్యం సేవిస్తూ కిందపడి వ్యక్తి మృతి చెందాడు.

Update: 2024-02-16 10:38 GMT

 దిశ, భిక్కనూరు : మద్యం సేవిస్తూ కిందపడి వ్యక్తి మృతి చెందాడు. విషయాన్ని కుటుంబ సభ్యుల కు సమాచారం ఎందుకివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మృతుని బంధువులు గ్రామస్తులు వైన్ షాప్ ఎదుట సుమారు 6 గంటల పాటు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన శుక్రవారం భిక్కనూరు మండల కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... మోటాట్ పల్లి గ్రామానికి చెందిన కుర్మ సాయిలు(55) రాత్రి పది గంటల ప్రాంతంలో సిద్ధ రామేశ్వర వైన్స్ లో మందు కొనుక్కున్నాడు. పక్కనే ఉన్న పర్మిట్ రూంలో కూర్చొని మందు తాగుతున్నాడు. వైన్ షాప్ నిర్వాహకులు వైన్స్ బంద్ చేసి పర్మిట్ రూం కూడా మూసి వేయించారు. అప్పటికే వైన్స్ యజమానులు,

    పర్మిట్ రూం సిబ్బంది సాయిల్ ను వెళ్లిపోవాలని పలుమార్లు చెప్పగా ఈ గ్లాసు అయిపోగానే వెళ్లిపోతానంటూ చెప్పాడు. దీంతో వారు వెళ్లిపోయిన కొద్దిసేపటి తరువాత మందు తాగుతున్న సాయిలు, క్వార్టర్ మందు బాటిల్ కోసం వైన్ షాప్ వద్ద కాపలా కాస్తున్న నైట్ వాచ్ మెన్ ను అడగగా తన వద్ద ఉన్న బాటల్ ను విక్రయించాడు. ఈ విషయం సీసీ ఫుటేజ్ లో నిక్షిప్తం కావడం, ఆ తర్వాత కొద్ది సేపటికి ఒక్కసారిగా కూర్చి పై నుంచి జారీ కింద పడిపోయి గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎవరూ గమనించకపోవడం, నైట్ వాచ్ మెన్ షట్టర్ ముందుకు వెళ్లి పడుకున్నాడు. రాత్రి జరిగిన విషయాన్ని నైట్ వాచ్ మెన్ సమాచారం ఇవ్వకపోవడం, ఈరోజు తెల్లవారుజామున పర్మిట్ రూం శుభ్రం చేసేందుకు వచ్చే వ్యక్తులు ఈ విషయాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో వైన్ షాపు

    నిర్వాకులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. వారు కుటుంబ సభ్యులకు గ్రామస్తులకు సమాచారం అందించారు. రాత్రి చనిపోతే ఇప్పటివరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని మృతుని బంధువులు, గ్రామస్తులు ముందుగా వైన్ షాప్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ సాయి కుమార్ నేతృత్వంలోని పోలీసులు మృతుని కుటుంబ సభ్యుల సమక్షంలో మధ్యాహ్నం 12 గంటలకు వైన్ షాప్ లో ఉన్న సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన అనంతరం రాత్రి 11.17 నిమిషాలకు మందు

    బాటిల్ ఎలా విక్రయించాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారని,ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయగా చర్చల అనంతరం రెండు లక్షల పైగా నష్టపరిహారం చెల్లించేందుకు వైన్స్ యాజమాన్యం ముందుకు రావడంతో 6 గంటల పాటు సాగిన ఆందోళనను ఎట్టకేలకు విరమించారు. అనంతరం పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు భిక్కనూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.


Similar News