‘చలో హైదరాబాద్’జయప్రదం చేయండి
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని ఈ నెల 25న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జిల్లా అధ్యక్షులు బాలనర్సు పిలుపునిచ్చారు.

దిశ, కామారెడ్డి : గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారించాలని ఈ నెల 25న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకట్ గౌడ్, జిల్లా అధ్యక్షులు బాలనర్సు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు ప్రభుత్వ వేతనాలు ఇస్తామని చెప్పి.. 15 నెలలు కావస్తున్నా ఈనాటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ప్రభుత్వం అసెంబ్లీ లో చర్చించి గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, వేతనాలు ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలన్నారు. ఇన్సూరెన్స్, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలంటే పోరాటాలే శరణ్యమన్నారు. జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు 25 న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.