సమాజంలో చెడును అరికట్టే బలం సాహిత్యానికి ఉంది : ఎమ్మెల్సీ కవిత

సమాజంలో చెడును అడ్డుకట్టే బలం సాహిత్యానికి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలో తరతరాల నుంచి అద్భుతమైన సాహిత్య సంపద దాగి ఉందన్నారు.

Update: 2023-05-31 10:30 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : సమాజంలో చెడును అరికట్టే బలం సాహిత్యానికి ఉందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలో తరతరాల నుంచి అద్భుతమైన సాహిత్య సంపద దాగి ఉందన్నారు. బుధవారం కంటేశ్వర్ బైపాస్ లోని లహరి ఇంటర్నేషన్ లో జరిగిన హరిదా రచయితల సంఘం ఐదవ మహాసభలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న చెడును అడ్డుకట్టి బలం సాహిత్యానికి ఉందన్నారు. ఇందురులో కవులు వర్ధిల్లాలాలని నినదించారు. నిజామాబాద్ కు ఉన్న గొప్ప గుణం పోరాట స్ఫూర్తి అని అన్నారు. దాశరథి జైలు గోడలపై బొగ్గుతో తెలంగాణ కోటి రతనాల వీణ అని రాసి ఉద్యమానికి ప్రాణం పోశారని గుర్తు చేశారు. చారిత్రాత్మక ఖిల్లా జైలును ఎమ్మెల్సీ నిధులు రూ.40 లక్షలతో టూరిజం పైంటుగా తీర్చి దిద్దే బాధ్యత తనేదనని అన్నారు. హరిదా లాంటి సాహిత్య సంఘానికి ఒక వేదికను ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. ఒక పుస్తకాన్ని చదివితే అది మన జీవితాన్ని చదివినట్లు ఉంటదని, భావితారలను లుక్ కల్చర్ కంటే బుక్ కల్చర్ అలవర్చాలని పేర్కొన్నారు.

హరిదా పురస్కార గ్రహీతలు వీరే..

వి.నరసింహ రెడ్డి, కవి, గజల్ రచయిత, తెలంగాణ భాష సాహిత్యంలో పంచరెడ్డి లక్ష్మణ్, వచన కవితలు పి.మాధవి లత, సాహిత్య విమర్శలో డాక్టర్ త్రివేణి, వచన కవితలో నరాల సుధాకర్, బంజారా సాహిత్యంలో రమేష్ కార్తీక్ నాయక్, యువ సాహిత్య పురస్కారం కళ్లెం నవీన్ రెడ్డి, సాహిత్య సేవలో మేక రంగస్వామి, కళా సాహిత్యంలో దారం గంగాధర్, పోలీస్ కవి తొగర్ల సురేష్ మొదలైన వారు హరిదా పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా బలగం ఫేమ్ రచ్చరవి చేసిన కామెడీ షో పలువురిని అలరించింది.

హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత, గౌరవ అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జడ్పి చైర్మన్ విట్టల్ రావు, టీ.ఎస్.డబ్ల్యూ.సీ.డీ.సీ ఆకుల లలిత, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, ఆత్మీయ అతిథులుగా జూలూరి గౌరీ శంకర్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరం శంకర్, ప్రత్యేక అతిథులుగా ఖ్యాతం సంతోష్, మారయ్య గౌడ్, హాస్యనటుడు రచ్చ రవి, కవి, వీ.పీ.చందన్ రావు, కాసర్ల నరేష్ రావు, ప్రధాన కార్యదర్శి గంట్యాల ప్రసాద్, కోశాధికారి తిరుమల శ్రీనివాస్ ఆర్య, వెంకన్న గారి జ్యోతి, గొప్ప ప్రసాద్, కంకణాల రాజేశ్వర్, మద్దుకూరి సాయిబాబు, రమేష్, లక్ష్మణ్ కవులు కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News