పోలీస్ వాహనంలో తరలిస్తున్న మద్యం.. సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు

పోలీస్ అధికారి వాహనంలో మద్యం సీసాల తరలిస్తున్న ఘటన బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

Update: 2023-11-28 15:36 GMT

దిశ, ఆర్మూర్ : పోలీస్ అధికారి వాహనంలో మద్యం సీసాల తరలిస్తున్న ఘటన బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్గల్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడంలో ముఖ్య భూమిక పోషించే పోలీసులే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తుంగలో తొక్కి కంచె చేను మేసిందన్న తరహాలో పోలీస్ అధికారి వాహనంలోని దర్జాగా ఎన్నికల కోడ్ ఉన్న ప్రస్తుత సమయంలో మద్యాన్ని తరలించడం భీమ్గల్ పట్టణ కేంద్రంలో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఓ పోలీస్ అధికారికి చెందిన వాహనం నెంబర్ AP 28 DU 7227 గల వాహనం డ్రైవర్ గా సున్నపు ఓంకార్ పనిచేస్తున్నాడు.

కాగా ఈ డ్రైవర్ స్వస్థలం భీంగల్ మున్సిపల్ పట్టణ కేంద్రం నుంచి తన వాహనంలో మద్యం తరలిస్తుండగా భీంగల్ ఎక్సైజ్ శాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకుని మద్యంను సీజ్ చేసి, వాహనం డ్రైవర్‌ను, అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి మద్యం దుకాణాలు బందు చేయడంతో 17 బీర్ కాటన్‌లను వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఆ మద్యం విలువ సుమారు 30,000/- వేల రూపాయలు ఉంటుందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.


Similar News