శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ ఆర్ ఎస్ పీ) ఎగువ నుంచి పెద్ద

Update: 2024-09-02 07:20 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్ ఆర్ ఎస్ పీ) ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుండడంతో మెరుపు వేగంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి దగ్గరగా చేరుకుంటోంది. దీంతో అధికారులు సోమవారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రాజెక్ట్ లోని 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ముందుగానే అప్రమత్తం చేయడంతో మత్స్యకారులు, పశువుల కాపరులు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు నది పరిసరాల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు.


Similar News