ఆపరేషన్ స్మైల్ లో 38 మంది బాల కార్మికులకు విముక్తి

కామారెడ్డి జిల్లా ఆపరేషన్ స్మైల్-10 లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 38 బాలకార్మికులను పట్టుకొని పని నుండి విముక్తి కల్పించినట్టు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు.

Update: 2024-02-01 13:57 GMT

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఆపరేషన్ స్మైల్-10 లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 38 బాలకార్మికులను పట్టుకొని పని నుండి విముక్తి కల్పించినట్టు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాల్లోని వివిధ బట్టల షాప్ లలో, ఆటో మొబైల్ షాపుల్లో, ఇటుక బట్టీల్లో పని చేస్తున్న 38 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలిపారు. పట్టుకున్న వారిలో ఏడుగురు అమ్మాయిలు, 31 మంది బాలురు ఉన్నారన్నారు.

    వీరిని డీసీపీవో కు అప్పగించినట్లు తెలిపారు. ఈ మేరకు 6 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి పిల్లలకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనబడితే వెంటనే డయల్ 100 కి కానీ 1098 కి కానీ కాల్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రఫీఉద్దీన్, రాజు, లావణ్య, కానిస్టేబుల్ లు భూమయ్య, సౌజన్య, శ్రీనివాస్, సుప్రజ, ప్రియాంక, శంకర్ తో పాటు జిల్లా ఆపరేషన్ స్మైల్ సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News