బాలికలను రక్షిద్దాం.. చదివిద్దాం

బాలికలను రక్షిద్దాం... చదివిద్దామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.

Update: 2024-01-24 16:36 GMT

దిశ, కామారెడ్డి : బాలికలను రక్షిద్దాం... చదివిద్దామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. బేఠీ బచావో బేఠీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం జాతీ య బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

    ఆడపిల్లలకు రక్షణ కల్పిద్దామని, వారి బంగారు భవితకు పునాది వేద్దామని తెలిపారు. ఆడపిల్లలను వారి తల్లిదండ్రులు ఇంటికి వెలుగుగా భావించాలని సూచించారు. ఆడపిల్లలను చదివించి, ఉన్నత ఉద్యోగాలు పొందే విధంగా చూడాలన్నారు. ఆడపిల్లల సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు లభిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల,వయో వృద్ధుల సంక్షేమ అధికారి బావయ్య, సీడీపీవో శ్రీలత, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 


Similar News