బస్సు ను వదిలి.. బైక్ పై వచ్చి ..మృత్యు ఒడిలోకి...

ఎంచక్కా బస్సుకే ఇంటికి వద్దామనుకున్నారు.

Update: 2024-11-11 16:07 GMT

దిశ, కామారెడ్డి : ఎంచక్కా బస్సుకే ఇంటికి వద్దామనుకున్నారు. బంధువు తన బైక్ తీసుకు వెళ్లాలని చెప్పడంతో.. బైకుపై బయకుదేరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యు ఒడికి చేరగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన వడ్డేపల్లి వేణు, అతని స్నేహితుడు రంజిత్ ఆదివారం పని నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు. పని ముగించుకుని వేణుకు సంబంధించిన బంధువు కోసం వేచి చూడగా ఆలస్యం అయింది. ఈ రాత్రి బస్సుకు ఏమి వెళ్తారు ఉదయాన్నే నా బైక్ తీసుకుని వెళ్ళండి. వెళ్ళాక నా బైకు మా వాళ్లకు ఇవ్వండి అని చెప్పడంతో సరే అని బస్సు ప్రయాణాన్ని మానుకుని హ్యాపీగా బైకుపై ఇంటికి బయకుదేరారు. తిరిగి వస్తుండగా చేగుంట బైపాస్ వద్ద వెనక నుంచి వేగంగా వస్తున్న డిసిఎం వ్యాను బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేణు(24) అక్కడికక్కడే మృతి చెందగా.. రంజిత్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.


Similar News