మహారాష్ట్రలో ధర్మం గెలిచింది...

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మం గెలిచిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు.

Update: 2024-11-23 15:25 GMT

దిశ ,ఆర్మూర్ :మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మం గెలిచిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించిన సందర్భంగా..రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్యేలు,నాయకులు శనివారం సంబరాలు చేసుకున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ..ధర్మం గెలిచిందని, కాంగ్రెస్ అబద్ధాలు ఎవరు నమ్మలేదని అన్నారు. ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చి కాంగ్రెస్ తెలంగాణలో, కర్ణాటకలో పదవులు పొందారన్నారు. మహారాష్ట్రలో ప్రజలు నమ్మలేదని, మరొకసారి మహారాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు. 


Similar News