అయోధ్యకు వెళ్తున్నా లడ్డుకు అడుగడుగునా భక్తుల నీరాజనం

అయోధ్యలోని రామ మందిరం ఆలయానికి తరలి వెళ్తున్న 1265 కిలోల భారీ లడ్డుకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో అడుగడుగునా స్వాగతం పలికారు.

Update: 2024-01-17 17:24 GMT

దిశ, భిక్కనూరు: అయోధ్యలోని రామ మందిరం ఆలయానికి తరలి వెళ్తున్న 1265 కిలోల భారీ లడ్డుకు కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో అడుగడుగునా స్వాగతం పలికారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భిక్కనూరు శాఖ ఆధ్వర్యంలో రాత్రి 9 గంటల 45 నిమిషాలకు మండల కేంద్రంలో ప్రవేశించిన లడ్డూను తీసుకెళ్తున్న వాహనానికి దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి హారతి ఇచ్చారు. దారి పొడవునా యువకులు బాణసంచా కాల్చారు. భారీ లడ్డు మండల కేంద్రం మీదుగా వెళుతుందన్న సమాచారంతో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ మెయిన్ రోడ్డు పైకి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దారిపొడవునా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.


Similar News