కామారెడ్డి జిల్లాలో కేసీఆర్ న్యూట్రిన్ కిట్.. బహిరంగ సభలో మంత్రి హరీష్ రావు వెల్లడి

వారం రోజులలో కేసీఆర్ న్యూట్రిన్ కిటును కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నట్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొమ్మిది జిల్లాలో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభం చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు..

Update: 2022-12-03 08:38 GMT

దిశ, పిట్లం: వారం రోజులలో కేసీఆర్ న్యూట్రిన్ కిటును కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తున్నట్లు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తొమ్మిది జిల్లాలో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రారంభం చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు శనివారం పిట్లం మండల కేంద్రంలో నూతనంగా 10 కోట్ల 70 లక్షల రూపాయల విలువతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ కు ప్రారంభోత్సవం చేశారు. రాష్ట్రంలో గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో ఐదు మెడికల్ కాలేజీలు ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 మెడికల్ కాలేజీ లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వంలో పెద్దపీట వేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదే అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నాయకులు బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో ప్రజలందరికీ పింఛన్లు 600 కర్ణాటకలో, మహారాష్ట్రలో 1000 రూపాయలు అందిస్తున్నరు. తెలంగాణ ప్రభుత్వ మాత్రం 2016 కేసీఆర్ ప్రభుత్వం అందిస్తుందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బీమా పథకాలు తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంటే బీజేపీ ప్రభుత్వము వీటినే కాపీ చేస్తూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క వంద రెండు కి డయాలసిస్ సెంటర్లను ప్రారంభించి కిడ్నీ వ్యాధులను వ్యాధిగ్రస్తులను వైద్యం అందిస్తుందని అన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రంలో తల్లి బిడ్డ మరణాలలో తెలంగాణ రాష్ట్రము మూడవ ర్యాంకులో ఉందని అన్నారు. దేశంలో ఖాతా ఓపెన్ చేస్తే 15 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తామని అని అన్నారు కానీ ఏ ఒక్కరి ఖాతాలో కూడా ఒక రూపాయి జమ కాలేదని ఎదవ చేశారు. పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధరలు పెంచి పేద ప్రజలను దడ్డి పిరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని అన్నారు. జూట మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. రైతుల బోరు మోటర్లకు మీటర్లు పెడితే 30 వేల కోట్లు కేంద్రం నుంచి అందిస్తామని కేసీఆర్ కు చెప్పిన కేసీఆర్ రైతుల పక్షపాతిగా వివరిస్తూ 30 వేల కోట్లను తీసుకోలేదని, రైతులకు ఉచితంగా 24 గంటల కరెంటును అందిస్తున్న ఏకైక ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదర్ శోభ రాజు,జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి పాటిల్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ వైద్య పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, ఎంపీపీ కవిత విజయ్, జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మి భాయి బాబు సింగ్, సొసైటీ చైర్మన్ శబదంరెడ్డి,నారాయణరెడ్డి సాయిరెడ్డి, ఆయా శాఖల అధికారుల, టిఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Tags:    

Similar News