కేసీఆర్ ఓటమిని అంగీకరించారు

ప్రతి ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముగియగానే మీడియా ముందుకు వచ్చి ఆర్భాటం చేసే కేసీఆర్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసిన వెంటనే మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు.

Update: 2023-12-01 13:04 GMT

దిశ ప్రతినిది, నిజామాబాద్ : ప్రతి ఎన్నికల సమయంలో, ఎన్నికలు ముగియగానే మీడియా ముందుకు వచ్చి ఆర్భాటం చేసే కేసీఆర్ పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిసిన వెంటనే మీడియా ముందుకు రాకుండా ఓటమిని అంగీకరించారని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడో తారీకు రోజున ప్రజా సంక్షేమ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. తమది సెక్యులర్ పార్టీ అని, దొర అరాచక నియంత పాలనపై తెలంగాణ ప్రజలు విసుగు చెందారన్నారు. స్పష్టంగా ప్రజలు మార్పు కోరారని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటేశారని పేర్కొ న్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వారికి, సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కే ప్రజలు ఈసారి పట్టం కట్టబోతున్నారన్నారు.

     ఎగ్జిట్ పోల్స్ సరళి ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ కు మెజారిటీ వస్తుందని చెబుతుండగా, 25 సీట్లకంటే ఎక్కువ బీఆర్ఎస్ కు రావు అని, ఇదే విషయాన్ని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ, పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉందని ఎద్దేవా చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలిగినట్టు ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అని కేటీఅర్ అంటున్నారని తెలిపారు. నిజామాబాద్ అర్బన్ లో కమీషన్ల ఎమ్మెల్యే పై కాంగ్రెస్ కు కనీవిని ఎరుగని రీతిలో మెజారిటీ వస్తుందన్నారు. తనకు మెజారిటీ, మైనారిటీ అనే ఫీలింగ్ లేదని, మనమంతా ఇండియన్స్ అని తెలిపారు. నిజామాబాద్ ప్రజలు కులమతాలకు అతీతంగా తనని మనస్ఫూర్తిగా ఆదరించారన్నారు. ఈ సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్, ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, నగర అధ్యక్షులు కేశ వేణు, నాయకులు నరాల రత్నాకర్ పాల్గొన్నారు. 


Similar News