అక్రమాలకు అడ్డా కల్లు డిపో
నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు సంబంధిత డిపోలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి వద్ద కల్లులో కలిపి విక్రయించే మత్తు పదార్థం అల్పోజోలంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ నగరంలో కృత్రిమ కల్లు విక్రయాలు ఫేమస్ అయిన డిపోలో డైరెక్టర్ పదవిని రూ.1.43 కోట్లకు అమ్మే వ్యవహారంలో ఆ కల్లు డిపో (సొసైటీ) పరువు గంగలో కలిసింది. దశాబ్దపు వయస్సు కలిగిన డిపోలో మత్తుకల్లు తయారీకి అడ్డా అన్నది అందరికీ తెలిసిందే. కేవలం ముగ్గురు డైరెక్టర్లు ఒక ఇంటికి చెందిన వారు కాగా మరో వ్యక్తి డైరెక్టర్ గా ఉండడాన్ని జీర్ణించుకోలేక అతన్ని పదవి నుంచి దించేందుకు మనీ సర్క్యూలేషన్ స్కీంలో ఉన్న కేసులను బూచిగా చూపి తొలగించే యత్నం ఇప్పుడు నిజామాబాద్ లో చర్చనీయాంశంగా మారింది. డిపోలో కల్లులో కలిపేందుకు అల్పోజోలం తెస్తుంటే ఆబ్కారీ అధికారులు పట్టు కుని తనను జైల్ లో వేశారు. తనకు రూ.10 లక్షల పరిహారం కావాలని ఆ వ్యక్తి బ్లాక్ మెయిల్ కు దిగిన ఘటన కలకలం రేపింది. పేరు సొసైటీ అని చెబుతున్నా అందులో 60 మంది గీత వృత్తి కలిగిన తాడి ట్యాపర్లుగా లైసెన్స్ కలిగిన వారితో ఏర్పడిన డిపోపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ 4వ టౌన్ పోలీసులు సంబంధిత డిపోలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి వద్ద కల్లులో కలిపి విక్రయించే మత్తు పదార్థం అల్పోజోలంను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అతన్ని రిమాండ్ కు పంపారు. ఈ విషయం డిపోలోని ఒక సభ్యుడి ద్వారా బయటకు వచ్చిందని అతన్ని బలవంతంగా సస్పెన్షన్ చేసి బయటకు పంపారు. ఆ వివాదం న్యాయస్థానం పరిధిలో ఉండగానే అప్పటి వరకు సంబంధిత అల్పాజోలంను రవాణా చేసి దొరికిన వ్యక్తిని జైలు నుంచి విడుదల చేయించి అతడికి రాచమర్యాదలు చేయడం డిపోలో మత్తుకల్లు అమ్మ కాలను బట్టబయలు చేసింది.
డిపోలో కల్లులో కలిపేందుకు అల్పోజోలం తెస్తుంటే ఆబ్కారీ అధికారులు పట్టుకుని తనను జైల్లో వేశారు. కాబట్టి తనకు రూ.10 లక్షల పరిహారం కావాలని జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి బ్లాక్ మెయిల్‌కు దిగిన ఘటన కలకలం రేపింది. కానీ అతన్ని కూడా మేనేజ్ చేసి జైలు నుంచి విడుద లైన వ్యక్తిని స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల తో ఫొటోలను దించి సోషల్ మీడియాలో పెట్టడం వైరల్ గా మారింది. ఇటీవల సంబంధిత డిపోలో మత్తు కోసం అల్పోజోలంను కలిపిన గీత కార్మికు డు అక్కడికక్కడే చనిపోయా డు. దానిపై మోపాల్ కు చెందిన బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళ నకు దిగారు.
చనిపోయిన వ్యక్తిని మత్తు ఎక్కువై చనిపోయాడని డిపో బయట వదిలేయడం విమ ర్శలకు దారితీసింది. ఎలాగో అలాగో ఆ కేసును మేనేజ్ చేసి బయటపడడం విశేషం. ఇదిలా ఉండ గానే నిజామాబాద్ బైపాస్ రోడ్డులో కల్లుబట్టిలో ఓ వ్యక్తి కల్లుబట్టిలో కల్లు సేవించి చనిపోయాడు. దానిని కప్పిపుచ్చేందుకు డిపో నిర్వాహకులు చేయని ప్రయత్నం లేదు. ఏకంగా ఆబ్కారి అధికారులకు ఫిర్యాదు అందలేదని పోలీసులకు అది అనుమానాస్పద కేసుగా నమోదు చేయించి పక్కదారి పట్టించాలని ఆరోపణలు ఉన్నాయి. కల్లుడిపోలో పేరుకు 60 మంది సభ్యులు ఉన్నట్లు చెబుతుండగా అందులో చాలా మట్టుకు డబుల్ లైసెన్స్ హోలర్డులు కాగా నాన్ లోకల్ వాళ్లకు నిజామాబాద్ పట్టణ సొసైటీలో సభ్యత్వం ఇచ్చారన్న అపవాదు మూటగట్టుకున్నారు.
గడిచిన ఎన్నికల్లో సొసైటీ నుంచి డైరెక్టర్లుగా ఎన్నికైన వారు కార్మికులు శ్రేయస్సు కొరకు వచ్చిన డబ్బును ఖర్చు చేస్తామని మాట ఇచ్చి తప్పారని సభ్యులు వాపోతున్నారు. డిపో నడువడానికి, కల్లు తయారికి, రవాణాకు అష్టకష్టాలు పడుతున్న కార్మికులకు రూ.500 అదనంగా ఇవ్వడానికి మనసు ఒప్పని డైరెక్టర్లు మరో డైరెక్టర్‌ను పదవి నుంచి దించడానికి కోటి రూపాయలకు పైగా ఆఫర్ చేయడాన్ని కార్మికులే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని ఆబ్కారి శాఖాధికారు ల వద్ద సొసైటీ యాక్టు ప్రకారం తేల్చుకునే పనిలో పడ్డారు. ఆబ్కారి మంత్రికి ఫిర్యాదు చేసి నగరంలో ఆ డిపోలో జరుగుతున్న బాగోతాన్ని బట్టబయలు చేస్తామని డిపో బాధితులు, కార్మికులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.