ఎవరికి వారే సొంతంగా ప్రచారం.. అధిష్టానం కరుణించేది ఎవరినో..

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నెలకొంది.

Update: 2023-03-19 13:56 GMT

దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నెలకొంది. మూడు వర్గాలుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారే సొంతంగా ప్రచారం చేసుకోవడం గమనర్హం. ఒకవైపు గంగారం మరోవైపు లక్ష్మీ కాంతారావు తోట, గడుగు గంగాధర్ లు ప్రచారం చేస్తున్నారు. కాగా గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చివరివరకు డిక్లరేషన్ చేయకపోవడంతో ప్రచారానికి కూడా సమయం సరిపడక కాంగ్రెస్ పార్టీ తీవ్ర నష్టానికి గురైందని సదరు కాంగ్రెస్ కార్యకర్త మనోగతం.

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుండి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీవల పిట్లం సభలో జుక్కల్ ఎమ్మెల్యేగా హనుమంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పకనే చెబుతున్నారు. కాగా మరోవైపు బీజేపీ పార్టీ అభ్యర్థిగా అరుణతార ప్రజాగోస బీజేపీ భరోస పేరుతో నియోజకవర్గంలో రెండో విడత ప్రచారం సైతం పూర్తిచేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమం పేరిట నియోజకవర్గంలో కార్యక్రమాలు, పాదయాత్రలు కొనసాగుతుంది. గత ఎన్నికల్లో చివరి వరకు కూడా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడంతో ప్రచారానికి సమయం సరిపోలేదని జుక్కల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్త అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం వెంటనే అభ్యర్థిని ప్రకటించి రంగంలో దింపాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

Tags:    

Similar News