తప్పుడు పత్రంతో ఉద్యోగం...రిటైర్డ్​ అయ్యాక కేసు నమోదు

తాను దళిత సామాజిక వర్గంకు చెందిన వాడినని తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ రిజర్వేషన్) ను ఉపయోగించుకొని ఆర్టీసీలో ఉద్యోగం పొంది అధికారిగా రిటైర్డ్ అయిన వ్యక్తిపై 40 ఏళ్ల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2024-02-08 15:13 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : తాను దళిత సామాజిక వర్గంకు చెందిన వాడినని తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం (ఎస్సీ రిజర్వేషన్) ను ఉపయోగించుకొని ఆర్టీసీలో ఉద్యోగం పొంది అధికారిగా రిటైర్డ్ అయిన వ్యక్తిపై 40 ఏళ్ల తర్వాత పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన చంద్రశేఖర్ తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో 1983లో ఆర్టీసీలో ఉద్యోగం పొందారు. మొదట కండక్టర్ ఉద్యోగం పొందిన ఎం. చంద్రశేఖర్ అంచలంచెలుగా ఎదుగుతూ ఏడీసీ నిజామాబాద్ వరకు పని చేసి రిటైర్డ్ అయ్యారు. రిటైర్మెంట్ పొందిన తర్వాత అసలు విషయం బయటపడటంతో అతనిపై టీఎస్ఆర్టీసీ నిజామాబాద్ వన్ డిపో మేనేజర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Similar News