మద్యానికి బానిసై అమ్మను చంపేసిన కొడుక్కి జైలు శిక్ష
కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన ఓ కొడుకు తల్లిని హత్య చేశాడు. దీంతో అతనికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. పెద్ద కొడప్గల్ గ్రామానికి చెందిన వడ్డే నాగవ్వ (48)ను ఆమె కొడుకు వడ్డే నర్సింలు మద్యానికి బానిసై మద్యం కోసం తల్లిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో.. ఆగ్రహం చెందిన నర్సింలు తల్లి నాగవ్వను కర్రతో తలపై కొట్టాడు. దీంతో తల్లి నాగవ్వ అక్కడికక్కడే మరణిచింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపి కోర్టులో నిందితున్ని హాజరుపరచగా కేసు రుజువు కావడంతో.. నిందితునికి మూడు సంవత్సరాల కఠిన గారాగార శిక్ష, 5000/- రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు. పోలీసుల తరపున వాదనలు వినిపించిన పీపీ రాజగోపాల్ గౌడ్, సరైన పద్దతిలో విచారణ చేసిన ఎస్సై విజయ్ కొండా, బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, ఎస్సై మహేందర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై మురళి, సీడీఓ మురళీకృష్ణ, విక్రమ్ రెడ్డి లను అభినందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.