మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడికి జైలు

మైనర్ బాలికను శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేసిన యువకుడు జైలు పాలైన సంఘటన గాంధారి మండల కేంద్రంలో కలకలం రేపుతుంది.

Update: 2024-01-11 09:09 GMT

దిశ, గాంధారి : మైనర్ బాలికను శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేసిన యువకుడు జైలు పాలైన సంఘటన గాంధారి మండల కేంద్రంలో కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే గాంధారి మండల కేంద్రంలోని ఓ గ్రామంలో 17 సంవత్సరాల బాలికను అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమించాడు. దాంతో మైనర్ బాలిక గర్భం దాల్చింది. దీంతో బాధితురాలి తల్లి గాంధారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. బాధితురాలిని సఖి సెంటర్ కు తరలించినట్టు ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు. 


Similar News