ఆర్మూర్ గురుకులంలో అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో కామర్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను అతిథి ఒప్పంద ప్రాతిపదికన బోధించుటకు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. ధనవేణి బుధవారం తెలిపారు.

Update: 2024-03-13 10:17 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో కామర్స్, పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులను అతిథి ఒప్పంద ప్రాతిపదికన బోధించుటకు మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జి. ధనవేణి బుధవారం తెలిపారు. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థినిలు

     ఈనెల 16వ తేదీ వరకు దరఖాస్తులను కళాశాలలో చేసుకోవాలన్నారు. అతిథి ఒప్పంద ప్రాతిపదికన కళాశాలలో బోధించుటకు సబ్జెక్టులలో 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలని, నెట్, సెట్ , పీ హెచ్డీ కలిగి ఉండి బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ప్రిన్సిపాల్ వివరించారు. ఈనెల 18న రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ లు వీటి ద్వారా బోధన అధ్యాపకులను ఎంపిక చేస్తామని తెలిపారు.


Similar News