రూ.7.98 కోట్ల విలువైన మత్తు పదార్థాలు ధ్వంసం
కామారెడ్డి జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నమోదైన 71 కేసుల్లో రూ.7,98,70,250/- విలువైన నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్లు కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి హన్మంతరావ్ తెలిపారు.
దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలోని వివిధ స్టేషన్లలో ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం నమోదైన 71 కేసుల్లో రూ.7,98,70,250/- విలువైన నిషేధిత మత్తు పదార్థాలను ధ్వంసం చేసినట్లు కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి హన్మంతరావ్ తెలిపారు. నిషేధిత మత్తు పదార్థాలైన గంజాయి, ఆల్ఫాజోలం, డైజోఫామ్, గంజాయి మొక్కలను జక్రాన్ పల్లి మండలం పడక్కల్ గ్రామంలోని శ్రీ మెడికేర్ సర్వీసెస్ కెమికల్ ఫ్యాక్టరీలో ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ నిషేదిత మత్తు పదార్థాల్లో 1285.25 కేజీల ఎండు గంజాయి, 32.585 కేజీల ఆల్ఫాజోలం, 71.845 కేజీల డైజోఫామ్,114 గంజాయి మొక్కలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ సుమారు ఏడు కోట్ల తొంబై ఎనిమిది లక్షల డెబ్బై వేల రెండు వందల యాభై రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు విజయ్ కుమార్, మధుసూదన్ రావ్, షాకీర్ హైమద్, సత్యనారాయణ, ఎస్సై విక్రమ్ కుమార్, నగేష్ సిబ్బంది పాల్గొన్నారు.