ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి

ఫిబ్రవరి 1 నుండి 15 వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాపర అధికారులకు సూచించారు.

Update: 2024-01-30 11:37 GMT

దిశ, కామారెడ్డి : ఫిబ్రవరి 1 నుండి 15 వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చీఫ్ సూపరింటెండెంట్లు, శాఖాపర అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ... వచ్చే నెల 1 నుండి 15 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహింపబడతాయని, ఇందుకు సంబంధించి అందజేసిన మార్గదర్శకాల మేరకు పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కోరారు.

     అభ్యర్థులు ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 14 వరకు జరుగుతాయన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు కామారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడలలో 50 కేంద్రాల్లో నిర్వహించనున్నామన్నారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, వాటి నిఘాలో పరీక్షా పేపర్లు ఓపెన్ చేయాలన్నారు.

    నిబంధనల మేరకు ఓ.ఏం.ఆర్. షీట్ విద్యార్థులకు అందజేస్తూ హాజరు రికార్డ్ చేయాలని అన్నారు. మాల్ ప్రాక్టీస్, మానవ తప్పిదాలు జరగకుండా చూడాలని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల చుట్టూ పొలీసు బందోబస్త్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కారక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షాక్ సలాం, ఎగ్జామినేషన్ కమిటీ సభ్యులు శ్రీనాథ్, నాగేశ్వరయ్య, శాఖాధికారులు పాల్గొన్నారు. 


Similar News