అక్రమ నిర్మాణాలను ఎన్ ఫోర్స్ మెంట్ బృందం పరిశీలన

ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో అక్రమంగా నిర్మించిన కట్టడాలు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పరిశీలించారు.

Update: 2024-07-10 14:43 GMT

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని వివిధ వార్డులలో అక్రమంగా నిర్మించిన కట్టడాలు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పరిశీలించారు. ఐదు అక్రమ ఇంటి నిర్మాణాలకు ఎన్ ఫోర్స్ మెంట్ బృందం రెవెన్యూ, మున్సిపాలిటీ, పోలీస్, ఆర్ అండ్ బి, అగ్నిమాపక శాఖల ఆధ్వర్యంలో పరిశీలించి పంచనామా చేశారు. అనుమతి కంటే విరుద్ధంగా ఉన్న ఇంటి నిర్మాణాలకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. అక్రమ ఇంటి నిర్మాణ దారులైన కొంగి భరత్, అరుణ్ రెడ్డి, గంగా మోహన్, పద్మావతి, ఇతర ఇంటి నిర్మాణాలపై చర్యలు ఉంటాయని మున్సిపల్ కమిషనర్ రాజు చెప్పారు. ఉన్నతాధికారుల నివేదిక ప్రకారం అక్రమ ఇంటి నిర్మాణాలను సీజ్ చేయడం, కూల్చివేయడం, జరిమానాలు విధించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ చెప్పారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ టిపిఓ హరీష్, సిబ్బంది ప్రభాకర్, అర్జున్, రామ్ సింగ్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.


Similar News