కలెక్టర్ చెప్పిన చేయరా సారు..
అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్ సందర్శించినప్పుడు వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిపాము.
దిశ, గాంధారి : అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్ సందర్శించినప్పుడు వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదని తెలిపాము. దీనికి గల కారణం సింగిల్ ఫేస్ కరెంటు వస్తుందని దీంతో ఇబ్బంది పడుతున్నారని, కలెక్టర్ దగ్గరుండి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సింగిల్ ఫేస్ కరెంటు కాస్త త్రీఫేస్ కరెంటు వేయించిన ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది పరిస్థితి. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ విద్యాభ్యాసం రెండు ఒకే దగ్గర ఉంటాయి. అప్పటి కామారెడ్డి కలెక్టర్ గా ఉన్న సత్యనారాయణ వాటర్ ప్లాంట్ కొత్తగా ఉన్న వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో కారణం తెలుసుకొని త్రీఫేస్ కరెంట్ సదుపాయం కల్పించినా వాటర్ ప్లాంట్ ఇంకా మరమ్మతులకు నోచుకోలేదు.
అంటే అధికారులు రెండు సంవత్సరాలుగా పనిచేయకుండా ఉన్న వాటర్ ప్లాంట్ ను కూడా పట్టించుకోకుండా వారికి పట్టనట్టు గత రెండు సంవత్సరాలుగా అలాగే చూస్తున్నారు. తప్ప ఇప్పటికీ మరమ్మత్తులకు నోచుకోని దుర్భర పరిస్థితి నెలకొంది. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు హాస్టల్లో ఉపాధ్యాయులు ఎంత ఎంత పట్టుదలతో పని చేస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. దీనిపై దిశ కస్తూర్బా పాఠశాల హాస్టల్ ఇన్చార్జ్ అయినటువంటి శిల్పను వివరణ కోరగా ఇప్పటికీ జిల్లా విద్యాధికారికి తెలియజేయడం జరిగిందని అంతేకాకుండా సోలార్ వాటర్ హీటర్ రెండు నెలలుగా పనిచేయడం లేదని దీనిపై కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.
కానీ ఇప్పటికి కూడా సోలార్ వాటర్ హీటర్ బాగు చేయించేందుకు వారం పది రోజుల్లో హీటర్ను బాగు చేయించేందుకు టెక్నీషియన్ ను పంపుతామని డీఈఓ చెప్పారని తెలిపారు. నీటి పీహెచ్ స్థాయి బాగానే ఉందని తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఇంచార్జ్ చెప్పడం కొసమెరుపు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కస్తూర్బా హాస్టల్ లో ఏర్పాటుచేసి విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా నాణ్యత గల భోజనం నాణ్యత గల విద్య నాణ్యత గల నీరు అన్ని అందేలా చూడడానికే హాస్టల్లో ఏర్పాటు చేసిందని అలాంటిది ఇప్పుడు మరమ్మత్తులకి రెండు సంవత్సరాలు పడితే ఎలా అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
అధికారులకు చెప్పిన స్పందించలేరంటూ వీరు వారి మీద వేయడం పై స్థాయి అధికారులు మాకు చెప్పలేదని అనడం ఎటు చూసినా సమన్వయ లోపం.. కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చలికాలంలో చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా ఉందని అలాగే త్రాగడానికి మినరల్ వాటర్ ను ఏర్పాటు చేయాలని లేదా ఉన్న వాటర్ ప్లాంట్ ను బాగు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.