త్వరలో మరో రెండు గ్యారంటీల అమలు

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో మరో రెండు గ్యారంటీ లను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Update: 2024-01-31 13:22 GMT

దిశ, నవీపేట్ : ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ లలో మరో రెండు గ్యారంటీ లను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రెంజల్ మండలం తాడ్ బిలోలి, బోర్గం, సాటాపూర్, రెంజల్, వీరన్న గుట్ట, దండి గుట్ట, దుపల్లి గ్రామాల్లో పర్యటించి స్థానిక సమస్యలపై తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. వీరన్నగుట్ట గవర్నమెంట్ స్కూల్ ను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.

    స్కూల్స్ కు అవసరమైన మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ప్రజల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం లో కేసీఆర్ ఖజానాను ఖాళీ చేశాడని తెలిపారు. మిగులు బడ్జెట్ రాష్ట్రం ను అప్పుల రాష్ట్రం గా మార్చిన బీఆర్ఎస్ కు తెలంగాణ లో భవిష్యత్తు లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఆరు గ్యారంటీ ల హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటికే రెండింటిని అమలు పరచగా మరో రెండు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం కోసమే తాను నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం లు ప్రారంభించానని ,పేద ప్రజల సంక్షేమం కొరకు పాటుపడతానని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

కాంగ్రెస్ లో చేరికలు...

రెంజల్ మండల కేంద్ర సర్పంచ్ రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News