అక్రమంగా నిర్మించిన భవనం సీజ్

అనుమతులు లేకుండా నిర్మించిన ఇంటి నిర్మాణాలపై చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ అన్నారు.

Update: 2024-02-09 14:00 GMT

దిశ, ఆర్మూర్ : అనుమతులు లేకుండా నిర్మించిన ఇంటి నిర్మాణాలపై చర్యలు తప్పవని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చవాన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల హౌసింగ్ బోర్డ్ మార్గంలో అనుమతులు లేకుండా నిర్మించిన భవనాన్ని ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు శుక్రవారం సంయుక్తంగా తనిఖీ చేసి సీజ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ మీడియాతో మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా

    అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని సూచించారు. హౌసింగ్ బోర్డ్ కు వెళ్లే మార్గంలో G+3 అనుమతులు పొంది G+5, సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణం చేపట్టిన భవనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. నివేదికను పై అధికారులకు పంపించామని అన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి హరీష్, ఎస్సై గంగాధర్, ఫైర్ స్టేషన్ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ సింగ్, మండల సర్వేయర్ షికారి రాజు, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 


Similar News