Chain snatching : బైక్ పై వెళ్తున్న భార్యాభర్తలు..ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
కామారెడ్డి పట్టణంలో చైన్ స్నాచింగ్ ఘటన జరిగింది.
దిశ, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలో చైన్ స్నాచింగ్( Chain snatching )ఘటన జరిగింది. మోటార్ సైకిల్ పై భార్యాభర్తలు ఇద్దరు వెళ్తుండగా.. వెనక నుంచి మరో మోటార్ సైకిల్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మహిళ మెడలో నుంచి బంగారు తాడును అపహరించుకున్నారని సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలో సోమవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో అడ్లూరు గ్రామానికి చెందిన కుంబాల రాజు, సౌమ్య అనే భార్యాభర్తలిద్దరూ కలిసి మోటార్ సైకిల్ పై కామారెడ్డి నుంచి అడ్లూరులోని వారి ఇంటికి వెళుతుండగా.. జయశంకర్ కాలని దాటి బ్రిలియంట్ స్కూల్ వద్దకు చేరుకున్నారు. వెనకాల నుంచి వీరిని ఫాలో చేస్తున్న పల్సర్ బండిపై వస్తున్న వ్యక్తి మోటార్ సైకిల్ వెనకాల కూర్చున్న కుంభాల సౌమ్య మెడలో నుంచి మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కొని పారిపోయినట్లు తెలిపారు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు