ఆదమరిస్తే.. అంతే సంగతి

ఆలూర్ మండల ప్రధాన రహదారి (ఆర్మూర్, వయా ఆలూర్ నందిపేట్ ) రహదారిలో గత రెండు సంవత్సరాల క్రితం అకాల వర్షాలతో కుప్పకూలిన కల్వర్ట్ ప్రమాదకరంగా ఉంది.

Update: 2024-06-26 09:26 GMT

దిశ, ఆలూర్ : ఆలూర్ మండల ప్రధాన రహదారి (ఆర్మూర్, వయా ఆలూర్ నందిపేట్ ) రహదారిలో గత రెండు సంవత్సరాల క్రితం అకాల వర్షాలతో కుప్పకూలిన కల్వర్ట్ ప్రమాదకరంగా ఉంది. రాత్రివేళలో ప్రమాదమని తెలిసినా అక్కడ సూచికలు లేకపోవడంతో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో అని స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పలువురు ప్రమాదాల బారినపడి ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయమై పాలకులకు, అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించట్లేదంటూ, ఇప్పటికైనా కల్వర్ట్ నిర్మించి ప్రమాదాలు అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News