షార్ట్​ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన దండు పోషన్న కు చెందిన పెంకుటిల్లు షార్ట్​ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదైంది.

Update: 2024-03-12 16:09 GMT

దిశ, భీంగల్ : భీంగల్ మండలం బడా భీంగల్ గ్రామానికి చెందిన దండు పోషన్న కు చెందిన పెంకుటిల్లు షార్ట్​ సర్క్యూట్ కారణంగా కాలి బూడిదైంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లన్న స్వామి ఆలయం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతుండగా ఆ గ్రామానికి చిందిన గొల్ల, కుర్మ యాదవులందరూ ఆలయం వద్ద కార్యక్రమంలో ఉన్నారు. కుల సంఘమంతా అక్కడే ఉండగా అదే కులానికి చెందిన దండు పోషన్న

     కుటుంబ సభ్యులందరూ ఇళ్లకు తాళం వేసి మల్లన్న గుడికి వెళ్లారు. సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో షార్ట్​సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. దాంతో పక్కన ఉన్న వారు చూసి ఇంటి యజమానికి, అగ్నిమాపాక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపాక సిబ్బంది వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంట్లోని రూ.50 వేల నగదు, నిత్యావసర వస్తువులు, బీరువా తో పాటు అందులో ఉన్న బట్టలు, డాక్యూమెంట్లు కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు.


Similar News