ఇందూరులో ఆలయాల ఆస్తులను పరిరక్షించాలని హిందూ సంఘాల నిరసన

ఇందూర్ నగరంలో ఆక్రమణలకు గురైన ప్రాచీన ఆలయాల శంభుని ఆలయం, నీలకంఠేశ్వర ఆలయాల ఆస్తులను పరిరక్షించాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-02-13 07:40 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: ఇందూర్ నగరంలో ఆక్రమణలకు గురైన ప్రాచీన ఆలయాల శంభుని ఆలయం, నీలకంఠేశ్వర ఆలయాల ఆస్తులను పరిరక్షించాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు మున్సిపల్ భవనం ఎదుట ఆందోళన చేస్తున్న క్రమంలో గేట్లను తోసేసి మున్సిపల్ భవనంలోకి ప్రవేశించి ప్రధాన ద్వారం గుండా కార్యాలయంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్భంగా నాయకులు పటేల్ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని శంభుని గుడి, నీలకంఠేశ్వర ఆలయ ఆస్తులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.


Similar News