క్రెడిట్ కార్డు వివరాలు చెప్పాడు... బుక్కయ్యాడు

గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు డీటెయిల్స్ చెప్పాలని కోరగా వెంటనే సదరు వ్యక్తి చెప్పడంతో అతని అకౌంట్లో నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయలు చోరీకి గురయ్యాయి.

Update: 2024-02-01 14:24 GMT

దిశ, కామారెడ్డి : గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి క్రెడిట్ కార్డు డీటెయిల్స్ చెప్పాలని కోరగా వెంటనే సదరు వ్యక్తి చెప్పడంతో అతని అకౌంట్లో నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీకి సంబంధించిన వివరాలను కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఎల్లగంటి భాను ప్రకాష్ అనే వ్యక్తి కి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు.

    ఇతని ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ కి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఆన్ లో ఉన్నాయని, దానిని ఆఫ్ చేయాలని చెప్పి, ప్లే స్టోర్ నుండి ఐ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేయాలని కోరాడు. అంతే కాకుండా తన క్రెడిట్ కార్డు వివరాలు చెప్పమని కోరాడు. వివరాలు చెప్పడంతో అతని అకౌంట్ నుండి ఒక లక్ష యాభై వేల రూపాయలు పోయాయని తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు

అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్ కానీ, వీడియో కాల్స్ కానీ లిఫ్ట్ చేయవద్దని కామారెడ్డి సీఐ చంద్రశేఖర్ రెడ్డి కోరారు. అలాగే వారు అడిగితే ఓటీపీ కానీ, మరేదైనా సమాచారం ఎట్టి పరిస్థితుల్లో చెప్పవద్దన్నారు. వాట్సాప్, ఫేస్​బుక్ లలో ఏదైనా తెలియని లింక్ వస్తే క్లిక్ చేయకూడదని సూచించారు. ఒకవేళ తెలియక అలా జరిగితే వెంటనే 1930 హెల్ప్ లైన్ నెంబర్ కు కానీ, 100 నంబర్ కి కానీ కాల్ చేసి సాయం పొందాలని కోరారు. 


Similar News