Sanction : చిట్యాలకు విద్యుత్ ఉపకేంద్రం మంజూరు

చిట్యాలలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ మంజూరు చేయించారు. ఆ

Update: 2024-10-29 15:33 GMT

దిశ,తాడ్వాయి : చిట్యాలలో విద్యుత్ ఉపకేంద్రాన్ని ఎమ్మెల్యే మదన్మోహన్ మంజూరు చేయించారు. ఆరుగాలం కష్టించే రైతన్నకు విద్యుత్ ఉపకేంద్రం మంజూరుకు కృషిచేసి, ఏడు గ్రామాల ప్రజలకు దన్నుగా నిలబడ్డారు. పట్టుబట్టి చిట్యాలకు విద్యుత్ ఉపకేంద్రం మంజూరు చేయించారు…మరో కొన్ని నెలల్లో అన్నదాతల కంట ఆనందాన్ని చూసే గడియలు సమీపిస్తున్నాయి. నాణ్యమైన విద్యుత్ తో రైతులు సిరులు పండించే తరుణం ముంచుకొస్తోందని రైతన్నలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయా గ్రామాలల్లో గృహ, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వోల్టేజ్‌ శాశ్వత పరిష్కారానికి బాటలు వేసిన ఎమ్మెల్యే మదన్మోహన్ పై ఆయా గ్రామాల ప్రజల ప్రశంసలతో వెల్లువెత్తుతున్నాయి.

ఏడు గ్రామాల ప్రజలకు ప్రయెజనం

చిట్యాల గ్రామంలో 33/11 కెవి విద్యుత్ ఉపకేంద్రం రూ,1.75 కోట్లతో మంజూరు చేశారు. దీంతో సరఫరా చేస్తున్న అర్గోoడ విద్యుత్ కేంద్రంపై భారం తగ్గనుంది. చిట్యాల గ్రామంతో పాటు సంతాయిపేట,అన్నారం, అన్నారం తండా,సోమరం, సోమరం తండా, వంకాయ పల్లి గ్రామాల ప్రజలకు రైతులకు లబ్ధి చేకూరుతుంది.

స్థానికుల్లో ఆనందం

కొత్తగా విద్యుత్ ఉప కేంద్రం మంజూరు చేయడంతో ఏడు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న కొన్నేళ్ల కల సహకారం అయిందని ఆనందం వ్యక్తం చేశారు. గతంలో విద్యుత్ సమస్యలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని విద్యుత్ ఉపకేద్రం మంజూరు చేయడానికి కృషి చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సమస్యలతో ఏడు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఏడు గ్రామాల ప్రజలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ దృష్టికి తీసుకెళ్లడంతో.. పట్టుబట్టి చిట్యాలకు విద్యుత్ ఉపకేంద్రం మంజూరు చేయించడంలో.. ప్రత్యేక చొరవ చూపాలని ఆయన అన్నారు. ఉప కేంద్రం మంజూరుకు కృషి చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


Similar News