చదువుతోనే భవిష్యత్తు బంగారు మయం.. ఆర్మూర్ ఏసీపీ

చదువుతూనే విద్యార్థుల జీవితాలు బంగారు మయం అవుతాయని, ప్రపంచంలో చదువు ఉన్నవాడిని సమాజం తప్పకుండా గుర్తిస్తుందని చదువుతూనే మనుషులకు మనుగడ సాధ్యమని ఆర్మూర్ ఎసీపీ గట్టు బస్వారెడ్డి అన్నారు.

Update: 2024-09-08 15:43 GMT

దిశ, ఆర్మూర్ : చదువుతూనే విద్యార్థుల జీవితాలు బంగారు మయం అవుతాయని, ప్రపంచంలో చదువు ఉన్నవాడిని సమాజం తప్పకుండా గుర్తిస్తుందని చదువుతూనే మనుషులకు మనుగడ సాధ్యమని ఆర్మూర్ ఎసీపీ గట్టు బస్వారెడ్డి అన్నారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కోటార్ మూర్లో గల జి.ఆర్ గార్డెన్ లో ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ట్రస్మా ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ ఏసీపీ గట్టు బస్వారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి దానిని వెలికి తీసి వారిని చదువులోనే కాకుండా క్రమశిక్షణ యుతమైన సమాజంలో వ్యక్తులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల్లో కెల్లా పవిత్రమైన వృత్తి అన్నారు. ఉపాధ్యాయ వృత్తిని వ్యాపార దృక్పథంతో చూడకుండా సమాజ హితం కోసం పాటుపడాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అధిక శాతం రాణిస్తున్నారని దానికి కారణం నిబద్ధత గల ఉపాధ్యాయులు ఉండడంతో పాటు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నారని అన్నారు. అనంతరం ప్రఖ్యాత శిక్షకులు శ్రీనివాస్ రెడ్డి ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు బోధన అంశాలపై మెలకువలను నేర్పించారు.

ప్రైవేట్ పాఠశాలల నుండి సుమారు 40 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. తర్వాత వివిధ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్పోక్స్ పర్సన్ జయసింహ గౌడ్, జిల్లా అధ్యక్షుడు నిత్యానందం, ఆర్మూర్ మండల ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షులు భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శి ప్రవీణ్ లోటస్, కోశాధికారి స్కాలర్స్ వేణు, కార్యక్రమ కన్వీనర్ మానస గణేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంతి గంగారెడ్డి, రాష్ట్ర ఎలక్షన్ కమిటీ మెంబర్ భాషిత సుందర్, కమిటీ మెంబర్ జెంటిల్ కిడ్స్ ప్రకాష్ జిల్లా కార్యదర్శి అరుణ్ జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు, ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయ బృందాలు, తదితరులు పాల్గొన్నారు.


Similar News