ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలి

Update: 2024-02-12 13:45 GMT

దిశ, నిజాంసాగర్: ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని బాన్సువాడ ఆర్డీవో భుజంగరావు సూచించారు. సోమవారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి - కొమలాంచ గ్రామ శివారు ప్రాంతంలో రూ. 476 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న నాగ మడుగు ఎత్తిపోతల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. సమయపాలన పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నాగ మడుగు మత్తడి నిర్మించే శివారు ప్రాంతంలో పైప్ లైన్ వెళ్లే మార్గంలో గల శివారు ప్రాంతాలతో పాటు భూములను కోల్పోయిన రైతుల వివరాలు, నష్టపరిహారం ఎంత మంది రైతులకు ఎన్ని ఎకరాలకు వచ్చింది, మత్తడి నిర్మాణానికి ఎన్ని ఎకరాలు కేటాయించారు అనే వివరాలను తహశీల్దార్ బిక్షపతిని అడిగి తెలుసుకున్నారు. మత్తడి నిర్మాణం పనుల్లో అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని తగ్గించేందుకు బ్లాస్టింగ్ అనుమతుల కోసం మంజీరా నది ప్రాంతాన్ని పరిశీలించారు. ఆర్డీవో వెంట తహసీల్దార్ బిక్షపతి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ చందూరి అంజయ్య, సర్వేయర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.




 



Similar News