ఎస్బీఐ సిఎస్పి సెంటర్ లో గోల్ మాల్

కోటగిరి మండల కేంద్రలోని ఎస్బిఐ బ్యాంక్ సంబంధించిన..ఒక సిఎస్పి సెంటర్ నిర్వాహకులు ఖాతాదారుల డబ్బులు గోల్ మాల్ చేశారు.

Update: 2024-10-21 16:04 GMT

దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రలోని ఎస్బిఐ బ్యాంక్ సంబంధించిన..ఒక సిఎస్పి సెంటర్ నిర్వాహకులు ఖాతాదారుల డబ్బులు గోల్ మాల్ చేశారు. దీంతో గత ఇరువై రోజుల క్రితమే బ్యాంక్ అధికారులు సదరు సిఎస్పి సెంటర్ కు తాళం వేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గత కొద్దీ సంవత్సరాల నుంచి సిఎస్పి నిర్వహిస్తున్న వ్యక్తి లావాదేవీలు విషయంపై.. వచ్చిన అమాయకపు మహిళాల ఖాతాల నుంచి వారికీ తెలియకుండా డబ్బులను మరో ఖాతాకు బదిలీ చేసుకున్నాడని తమ డబ్బులు తమ ఖాతాలో లేకపోవడంతో..ఒక్కొక్కరిగా సంబంధిత బ్యాంక్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో బ్యాంక్ అధికారులు గత ఇరువై రోజుల క్రితమే సిఎస్పై సెంటర్ కు తాళం వేయడంతో ఈ విషయంలో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుల రూపంలో ఇప్పటి వరకు సుమారు రెండు లక్షలపై చిలుకు నగదు తమ ఖాతాల నుంచి పోయిందని ఫిర్యాదుల వచ్చాయి. ఇంకా చాలా ఖాతాల నుంచి డబ్బులు పోయాయాని విశ్వసనీయ సమాచారం. అయితే గతంలో కూడా మహిళా సంఘాలకు సంబంధించిన డబ్బులు విషయంలో అవకతవకలు జరిగిన విషయం అందరికి తెలిసిందే అయినా.. కూడా మళ్ళీ సదరు వ్యక్తి సిఎస్పై సెంటర్ అప్పగించడం వెనుక అంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు.


Similar News