పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు పారదర్శకంగా పని చేయాలి

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు పారదర్శకంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.

Update: 2024-02-15 16:23 GMT

దిశ, కామారెడ్డి : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు పారదర్శకంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ గదిలో జిల్లా ఎస్‌ఎస్‌టీ, ఎఫ్ ఎస్‌టీ టీములకు జాతీయస్థాయిలో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో అక్రమ మద్యం, డబ్బు, సరుకుల పంపిణీ జరిగినప్పుడు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలకు సమాచారం వచ్చిన వెంటనే వెళ్లి పెట్టుకోవాలని సూచించారు. ఎన్నికల్లో రూ. 50 వేలకు మించి ఆధారాలు లేని డబ్బులను సీజ్ చేయాలని చెప్పారు. రూ. 10 లక్షలకు మించి డబ్బులు దొరికితే ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించాలని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాల నివారణకు ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీలు కృషి చేయాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కామారెడ్డి ఆర్డీవో వై. రంగనాథ రావు , ఎల్లారెడ్డి ఆర్‌డీఓ ప్రభాకర్, కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, అధికారులు పాల్గొన్నారు.


Similar News