బీఆర్‌‌ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వెలసిన ఫ్లెక్సీ.. గుణపాఠం చెప్తామని వార్నింగ్!

బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ చూసినా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.

Update: 2023-11-23 05:06 GMT

దిశ, నందిపేట్: బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఎక్కడ చూసినా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నందిపేట మండలంలో వెంకటేశ్వర కాలనీలో 15వ వార్డు ఎస్సీ కాలనీలో గత 35 సంవత్సరాల క్రితం కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఇదివరకు కాలనీలో ఎటువంటి అభివృద్ధి పనులు కాలేవని ఫ్లెక్సీ ప్రదర్శిస్తే ఆ యొక్క ఫ్లెక్సీ ని కొందరు అధికార అహంకారంతో ఎవరూ లేని సమయంలో వచ్చి ఫ్లెక్సీలు చింపి వేయడం జరిగింది. మీకు దమ్ముంటే అభివృద్ధి చేయండి కానీ ఇలా మా ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే మమ్మల్ని మన ధైర్యానికి గురి చేయవద్దని రానున్న కాలంలో మా కాలనీ నుంచి కచ్చితంగా మీకు గుణపాఠం చెప్తామని తెలియజేయడం జరిగింది. మా గల్లీని అభివృద్ధి చేయని నాయకుడికి మా గల్లీలో ఓట్లు అడిగే హక్కు లేదు అని మీ వెంకటేశ్వర కాలనీ వాసులు ఫ్లెక్సీ ద్వారా తెలియజేయడం జరిగింది.


Similar News