నిజామాబాద్ లో అగ్నిప్రమాదం

నగరంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది.

Update: 2024-03-24 08:56 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : నగరంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఇంద్రపూర్ సమీపంలోని ప్రైవేటు ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతు కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మరమ్మతు కేంద్రానికి చుట్టు పక్కల ఇళ్లు ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Similar News