షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో అగ్ని ప్రమాదం

షార్ట్ సర్క్యూట్ తో పెంకుటింట్లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన ఆదివారం సాయంత్రం తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2024-02-18 15:26 GMT

దిశ, తాడ్వాయి : షార్ట్ సర్క్యూట్ తో పెంకుటింట్లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటన ఆదివారం సాయంత్రం తాడ్వాయి మండలంలోని కృష్ణాజివాడి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణాజివాడి గ్రామానికి చెందిన జంగం శివకృష్ణ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చలరేగాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పి వేశారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణహాని తప్పింది. కానీ మంటల్లో ఫ్రిడ్జ్, బట్టలు, బియ్యం,ఇతర సామాగ్రి కాలిపోయాయి. 


Similar News