అకాల వర్షంతో - అన్నదాత ఆగం..

ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన సమయానికి అకాల వర్షం ఆగం చేసింది.

Update: 2024-10-20 03:54 GMT

దిశ, కోటగిరి : ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికొచ్చిన సమయానికి అకాల వర్షం ఆగం చేసింది. కరుణించాల్సిన వరుణుడే కన్నెర్ర చేయడంతో కష్టాల ఊబిలో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడనే చెప్పవచ్చు. అందుకు నిదర్శనంగా కోటగిరి మండల కేంద్రంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి రోడ్ల పై ఆరబోసుకున్న వరి ధాన్యం కుప్పలు పూర్తిగా తడిచి ముద్దయ్యాయి. మరికొన్నిచోట్ల కుప్పలలో పూర్తిగా నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట పూర్తిగా తడిచిన పోవడంతో రైతన్నలు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు.


Similar News