రైతుల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం రైతులు సంతోషంగా ఉండాలని ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేసిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే అన్నారు.

Update: 2023-06-03 14:22 GMT

దిశ, జుక్కల్ : తెలంగాణ ప్రభుత్వం రైతులు సంతోషంగా ఉండాలని ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేసిందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సిందే అన్నారు. జుక్కల్ మండలంలో నిర్వహించిన రైతువేదిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేశామని అన్నారు. రైతులు సంతోషంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆయన అన్నారు.

రైతుల కోసం రైతు బీమా, రైతుబంధు, రైతుల కోసం పంటనష్టం అమలు చేశారని ఆయన అన్నారు. కడుపుకు అన్నం పెట్టే రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆయన అన్నారు. అందుకే రాష్ట్రంలో ఎన్నోసంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ బాలమణి హనుమంత్, మండల రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గంగు నాయక్, జుక్కల్ సొసైటీ చైర్మన్ శివానంద్ పటేల్, చండేగాం గ్రామ సర్పంచ్ వెంకట్రావు, అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News