విజయ డెయిరీ అధికారులపై రైతుల కన్నెర్ర

గ్రామాల్లో పాల ఉత్పత్తిని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న తమ జీవితాలతో విజయ డెయిరీ నిర్వాహకులు, అధికారులు పరాచకాలు ఆడుతున్నారని తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ పాడి రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించారు.

Update: 2024-01-29 09:08 GMT

దిశ, తాడ్వాయి: గ్రామాల్లో పాల ఉత్పత్తిని జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న తమ జీవితాలతో విజయ డెయిరీ నిర్వాహకులు, అధికారులు పరాచకాలు ఆడుతున్నారని తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్  పాడి రైతులు సోమవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పాడి రైతులు మాట్లాడుతూ..పాల కొనుగోలు, బిల్లులు మంజూరు విషయాంలో సంబంధిత అధికారులు పదే పదే పేచీలు పెడుతూ తమను తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి రైతుకు హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతం రాకపోతే తికమక అవుతారానే ఉద్దేశంతో వాయిదాలు ఉండకుండా చేస్తారు. అలాంటిది రైతుల విషయానికొస్తే ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకు వహిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.


Similar News