విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి

గడ్డి కోత మిషన్ తో పొలం గట్లపై ఉన్న గడ్డిని కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు.

Update: 2024-01-30 15:27 GMT

దిశ, నాగిరెడ్డిపేట్ : గడ్డి కోత మిషన్ తో పొలం గట్లపై ఉన్న గడ్డిని కోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య (47) అనే రైతు మంగళవారం మధ్యాహ్నం పోచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పొలం మండలంలోని వదలపర్తి గ్రామ శివారులో ఉండగా ఆ పంట పొలాన్ని కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం పంట

    పొలంలోని గట్లపై ఉన్న పచ్చిగడ్డిని గడ్డి కోసే మిషన్ ద్వారా కోస్తుండగా పంట పొలంలో ఉన్న విద్యుత్ వైర్ కు మిషన్ తాకి ప్రమాదవశత్తు విద్యుత్ సరఫరా జరిగి మల్లయ్య కు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. అదే పంట పొలంలో కలుపుతీస్తున్న మల్లయ్య కుటుంబ సభ్యులు మల్లయ్య ను వెంటనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యుడు పరీక్షించి మల్లయ్య మృతి చెందినట్లు నిర్ధారించడంతో మల్లయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతునికి భార్య మల్లవ్వ ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై రాజు తెలిపారు.


Similar News