మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష గడువు పొడిగింపు : ప్రిన్సిపాల్

నిజాంసాగర్ మండలంలోని మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

Update: 2024-03-03 10:14 GMT

దిశ,నిజాంసాగర్: నిజాంసాగర్ మండలంలోని మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష గడువు మరోసారి పొడిగించినట్లు ప్రిన్సిపాల్ చంద్రకళ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరమునకు గాను 6వ తరగతి మరియు 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీ సీట్లకు గాను అర్హులైన విద్యార్థుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను మార్చి 11వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు https://telanganams.cgg.gov.in లింక్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News