అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

జిల్లా ప్రజలు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని జిల్లా ఎస్పీ సీహెచ్. సింధు శర్మ కోరారు.

Update: 2024-02-13 15:43 GMT

దిశ, కామారెడ్డి : జిల్లా ప్రజలు తప్పని సరిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని జిల్లా ఎస్పీ సీహెచ్. సింధు శర్మ కోరారు. 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జనవరి 15 నుంచి ఈ నెల 14 వరకు జిల్లాలో అందరికీ అవగాహన సదస్సులు, సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. నిబంధనలు పాటించకుండా వాహనాలు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

     పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో 280 అవగాహన కార్యక్రమాలు, పోలీసు కళాబృందం ద్వారా 35 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. ఎల్లారెడ్డి సబ్ డివిజన్ పోలీసు వారి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం చేపట్టగా 300 మంది పాల్గొని 40 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు తెలిపారు. అలాగే 819 డ్రంకెన్ డ్రైవ్ కేసులు, వాహన నంబర్ ప్లేట్ లు సరిగా లేని 1466 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


Similar News