డిచ్ పల్లిలో కాన్ కార్డ్ డ్రై పోర్ట్ డిపో
రైల్వే శాఖ సహకారంతో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కాన్కార్డ్ డ్రైపార్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్. శేషగిరిరావు తెలిపారు.
దిశ, నిజామాబాద్ సిటీ : రైల్వే శాఖ సహకారంతో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో కాన్కార్డ్ డ్రైపార్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్. శేషగిరిరావు తెలిపారు. నగరంలోని కపిల హోటల్ లో బుధవారం నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డిచ్పల్లిలో కాన్కార్డ్ ఏర్పాటుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ట్రేడర్స్ కు ట్రాన్ప్సొటేషన్ భారమవుతున్న తరుణంలో ఈ డ్రైపోర్ట్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
డోర్ టు డోర్ డెలివరీ సౌకర్యం కాన్ కార్డ్ ద్వారానే సాధ్యపడుతుందన్నారు. డిచ్పల్లి లో డ్రై పోర్ట్ డిపో ఏర్పాటు అయితే అనేక ఉత్పత్తి పరిశ్రమలు, భారీ ఫ్యాక్టరీలు, స్థాపించడంతో పాటు ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. డ్రై డిపో ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలతో పాటు, ఉత్తరాదిలోని రాష్ట్రాలకు కూడా అందుబాటులోకి వాస్తాయన్నారు. దీని ద్వారా 300 నుంచి 500 కోట్లు గ్రాస్ రెవెన్యూ వచ్చేటట్లు ట్రేడర్స్ కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దినేష్ రెడ్డి, కాన్ కార్డు డివిజన్ ఇంచార్జ్ హితేన్ బీమాని, సంజయ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.