16 వీడియో స్క్రీన్ వాహనాల ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి 16 వీడియో స్క్రీన్ వాహనాలను ఏర్పాటు చేయించి ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి మహమ్మద్ షకీల్ అమీర్ లు ఆదివారం ప్రారంభించారు.

Update: 2023-03-19 13:02 GMT

దిశ, ఆర్మూర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి 16 వీడియో స్క్రీన్ వాహనాలను ఏర్పాటు చేయించి ఆర్మూర్, బోధన్ ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి మహమ్మద్ షకీల్ అమీర్ లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారీ స్క్రీన్ లతో ఏర్పాటు చేయించిన 16 ప్రచార రథాల వాహనాలు మహారాష్ట్రలోని కాందార్ లోహ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేస్తాయన్నారు.

ఈ నెల 26వ తేదీన సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని కాందార్ లోహాలో భారీ బహిరంగ సభ పెట్టనున్న నేపథ్యంలో తెలంగాణలో చేపడుతున్న ప్రభుత్వ పథకాలు అక్కడి ప్రజలకు వివరించడం కోసమే ఈ భారీ స్క్రీన్ లతో కూడిన వాహనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో తిప్పనున్నట్లు ఎమ్మెల్యేలు చెప్పారు. ప్రచార రథాలు మహారాష్ట్రలోని 1600 గ్రామాల్లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వివరాలు మహారాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యేలు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News