హిందీలో సమాధానం ఇవ్వలేదని.. మహిళను పొట్టుపొట్టుగా కొట్టిన కాలనీవాసులు

బాన్సువాడలో ఓ మహిళను చితక బాదిన ఘటన కలకలం రేపింది.

Update: 2025-01-10 14:10 GMT

దిశ,బాన్సువాడ : బాన్సువాడలో ఓ మహిళను చితక బాదిన ఘటన కలకలం రేపింది. నల్లని బుర్ఖా వేసుకుని చేపల మార్కెట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను కాలనీవాసులు ఆపి, మీరు ఎవరు.. ఎక్కడ నుంచి వచ్చారని హిందీలో ప్రశ్నించారు. దీంతో లక్ష్మి అనే మహిళ బుర్ఖా వేసుకుని హిందీలో మాట్లాడకపోవడం, సరైన సమాధానం ఇవ్వకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. పిల్లలను కిడ్నాప్ చేయాడానికి వచ్చారనే అనుమానంతో ఆ మహిళను చితక బాదారు. అలాగే మహిళతో పాటు ఉన్న మరో వ్యక్తి పరార్ అయ్యాడు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News