ఇందిరమ్మ వరద కాలువకు ఎస్సారెస్పీ నీరు

నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారం శనివారం ఇందిరమ్మ వరద కాలువ కింది ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు.

Update: 2024-01-06 13:26 GMT

దిశ, భీంగల్ : నీటి పారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశానుసారం శనివారం ఇందిరమ్మ వరద కాలువ కింది ఆయకట్టుకు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేశారు. ముప్కాల్ హెడ్ రెగ్యులేటరీ నుండి పంటల సాగుకు గాను ఇందిరమ్మ వరద కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని డీఈ గణేష్ విడుదల చేశారు. ఇందిరమ్మ వరద కాలువ వెంట చేపలు పట్టే వారు, పశుల కాపరులు, రైతులు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు. పంట సాగుకు ఇస్తున్న సాగునీటిని ఆయకట్టు రైతులు పొదుపుగా వాడుకోవాలని, వృథా చెయ్యకూడదని విజ్ఞప్తి చేశారు. 


Similar News