మదన్మోహన్ కు ఎల్లారెడ్డి ఆర్ఎంపీల మద్దతు

ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది.

Update: 2023-11-25 12:15 GMT

దిశ, లింగంపేట్ : ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. లింగంపేట మండల కేంద్రంలో ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు ఎన్నికల్లో మదన్మోహన్ కు మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించారు. కరోనా సమయంలో పెద్ద మనసుతో నియోజకవర్గంలోని పేదలకు అండగా నిలిచిన మదన్మోహన్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని వారు ప్రకటించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మదన్మోహన్ మాట్లాడుతూ తనకు మద్దతు పలికిన ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ కి ధన్యవాదాలు తెలిపారు. నిరుపేదలకు సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న మీరు నిజమైన దేవుళ్లని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఎంపీ యాక్ట్ 2009ను సంస్కరించి అమలు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు. సమావేశంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలకు చెందిన సుమారు 300 మంది ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు, అసోసియేషన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 


Similar News