నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలు
నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైందని, తాను ప్రధాని కావడం కోసమే దేశ విభజనకు అంగీకారం తెలిపారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు.
దిశ, కామారెడ్డి : నెహ్రూ స్వార్థ రాజకీయాల వల్లే నాడు దేశం రెండు ముక్కలైందని, తాను ప్రధాని కావడం కోసమే దేశ విభజనకు అంగీకారం తెలిపారని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. దేశ విభజన గాయాల స్మారక దినం అనే కార్యక్రమం అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ...దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు ఊచకోతకు గురయ్యారని, ఆ గాయాలను నేటికీ భారతదేశం మరవలేదని అన్నారు. అందుకే నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ దేశ విభజన గాయలబ్ స్మారక దినంగా ఆగస్టు 14న అప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించాలని సూచించారని అన్నారు.
కాంగ్రెస్ విభజన రాజకీయాలు దేశానికి ప్రమాదకరం అని అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ ముక్త కంఠంతో ఖండిస్తుందన్నారు. హిందువులకు మద్దతుగా సీఏఏ చట్టాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని గుర్తు చేశారు. కార్యక్రమం అనంతరం నాడు విభజన సందర్భంగా చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వీపుల్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రీకాంత్, కౌన్సిలర్ శ్రీనివాస్, నరేందర్, నాయకులు సంతోష్ రెడ్డి, వెంకట్, వేణు, సంధ్య, అనిత, నరేష్, రఘు, రజినీకాంత్, రవీందర్, గంగాధర్, గోవర్ధన్, విజయ్, రాజగోపాల్, రాజేష్ పాల్గొన్నారు.