డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫొటోలు తీసుకుని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు.

Update: 2024-01-27 15:10 GMT

దిశ, కామారెడ్డి : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫొటోలు తీసుకుని వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనెల 30లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ లో తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజనీర్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని మండలాల వారీగా మంజూరైన ఇండ్లు, పూర్తయిన, వివిధ దశల్లో ఉన్న ఇండ్ల వివరాలను సేకరించి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులకు పూర్తి సమాచారం అందజేయాలని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శుల

    సహకారంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఐడీ నెంబర్ల వారీగా గృహాలు ఏ దశలో ఉన్నాయో వాస్తవ వివరాలను సేకరించి నివేదిక రూపంలో పంపాలని కోరారు. ఉపాధి హామీ పథకం కింద ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మెటీరియల్ కాంపోనెంట్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి నాలుగు కోట్ల రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గం లోని మూడు మండలాలకు రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు చెప్పారు. ఈ నిధులతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో,

    అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పనులు చేపట్టాలని తెలిపారు. సిమెంట్ రోడ్లు నిర్మించడం కోసం ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. పనులు నాణ్యతగా చేపట్టి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, గృహ నిర్మాణ సంస్థ డిప్యూటీ ఇంజనీర్ ప్రసాద్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఇంజనీర్ మురళి, తహసీల్దార్లు, వివిధ శాఖల ఇంజనీర్లు పాల్గొన్నారు.


Similar News